Friday 11 November 2011

మేలు కొలుపు

ఆవులకు  పాలుపోవటం  లేదు
గోవులకు  దిక్కు తోచటం లేదు
తమను పోలిన  తమ వంటి  జీవాలను
తమ వెనక వస్తున్న ఆకారాలను  చూసి ............
వేష ధారణ  తమదే ,, కాని ఎక్కడో , ఏదో  లోపం
ఆ కళ్ళల్లో  తెలియని కసి ,
కదను తొక్కుతున్న  కాళ్ళలో  పదను.....
         
            శ్రావ్యమైన సన్నాయి  మేళం కాదది ,
            కలగాపులగ మైన  వాయిద్యాల గోల అది .
            పా లు కుడుస్తున్న  బుజ్జాయి ఝడుసుకుంది
            తల్లికి  దగ్గరగా  జరిగింది .

చుట్టూ  చూసాయి ఆవులు , కనుచూపుమేరా  తామే ,,
సంఖ్యా బలం  తమదే , అయినా తెలియని భయం .
అడుగు  ముందుకేయలేని పిరికితనం ,,
బలం లేక  కాదు ,దైర్యం  చాలక ......
చుట్టూ అల్లుకుంటు న్న చీకటి భయం  కల్గిస్తుం టే
సత్తా కల్గి కూడా  ముందుకు సాగలేని నిస్తేజం .....

             తినేది  సాత్వికాహారమైనా ,అవసరమైతే కొమ్ము  విసిరి
              అన్యాయాన్ని ఎదిరించ గలమని తెలుసు కోలేని తనం ...
              కాని,,,, ఎన్నాళ్ళిలా???
              ఇది కొనసాగుతే, రాబోయే తరాలలో
              సంక్రాంతికి  గంగిరెద్దుల మేళం  ఉండేనా??
              దున్నపోతుల  స్వైరవిహారం పెరగదా???
   
మేక వన్నె పులుల కధ నాటిది ,
అవు వన్నె దున్నపోతుల కధ  నేటిది.

             పోలాలలోని  గింజలు  రాబందుల వశమై,
             సంక్రాంతి సంబరాలు దున్నల  వశమైతే ,
             ఆ  సమాజం  పేరేంటి ???

  తెలివితో బాటు  ధైర్యం కావాలి.
  జయించే పోరాట  పటిమ  రావాలి.
  కేవలం పాలిచ్చి తృప్తి పడడం కాదు ,
 పాలు పంచుకోవడం కూడా రావాలి.
           
                 మంచితనం చేతకానితనం కాదంటు ,
                 దున్నపోతుల ను నిలువరిం చాలి .
                 సత్యమేవజయతే నినాదంలోని
                 స్వరం  తప్పటడుగు  వేయరాదు .
 
 నిలకడగా  నిలిచిన  ఆ సత్య ధర్మాలే
భవిష్యత్తుకు స్వాగత  గీతాలు కావాలి..

1 comment:

  1. mee baadha ardham indi kaani ...mee lanti chaduvu kunna vaallu koodaa mudhulla untarante ento anukunna nijamenemooo...!!!

    ReplyDelete