Friday 11 November 2011

నిశబ్దం

లోయల  లోతుల్లోని మార్మిక  ప్రతిధ్వని  పర్వతాల గాంభీర్య మై ,
చెట్ల  శాఖల్లోని రాపిడి  మేఘాల్లోని ఘనీభవించిన నిశబ్ద మై ,
     మైమరపించే సుఖంలోని  స్వప్నమే  నిశబ్దమైన  విషాదమై,
     ఆలోచన లేని  కృత్రిమ  శబ్దాలే  మృత్యువు లాంటివి  నిశబ్దమై ,
సున్నితమైన నిశబ్దానికి  చోటిచ్చే  సవ్వడుల మధ్య  సమయమై ,
ఆ సవ్వడులకు  పునాది యైన  చీకటి రాత్రుల దరహసమై ,
        రెండు మహా యుద్ధాల మధ్య  నిజమనుకుంటున్న శాంతి కపోతమై,
        మారుతున్న మనుషుల, వ్యవస్థ ల  జారిపోతున్న
        విలువలను  నిశబ్దంగా పరికిస్తున్న నిర్వచనీయ నిశబ్ద మిది.
         యుగయుగాల  నుంచి  కొనసాగుతున్న నిశబ్ద మిది .
         ఆ ద్యంత రహితమైన నిశబ్ద మిది......

1 comment:

  1. ఆద్యంత రహిత నాదమది -
    నిశ్శబ్దమది !
    గగనం గభీరం
    మనస్సులో రేత మై
    ఆలోచనలలో ప్రేరితమై
    చేతలలో నిశ్శబ్దమై
    పరుగిడుతున్న జీవ నదియై
    నిఇశబ్ద పాత మై
    అరణ్యం లో వృక్షమై
    నీరవ నిశీధి లో
    అంతా గుప్చుప్ !

    ReplyDelete