Friday 11 November 2011

మేలు కొలుపు

ఆవులకు  పాలుపోవటం  లేదు
గోవులకు  దిక్కు తోచటం లేదు
తమను పోలిన  తమ వంటి  జీవాలను
తమ వెనక వస్తున్న ఆకారాలను  చూసి ............
వేష ధారణ  తమదే ,, కాని ఎక్కడో , ఏదో  లోపం
ఆ కళ్ళల్లో  తెలియని కసి ,
కదను తొక్కుతున్న  కాళ్ళలో  పదను.....
         
            శ్రావ్యమైన సన్నాయి  మేళం కాదది ,
            కలగాపులగ మైన  వాయిద్యాల గోల అది .
            పా లు కుడుస్తున్న  బుజ్జాయి ఝడుసుకుంది
            తల్లికి  దగ్గరగా  జరిగింది .

చుట్టూ  చూసాయి ఆవులు , కనుచూపుమేరా  తామే ,,
సంఖ్యా బలం  తమదే , అయినా తెలియని భయం .
అడుగు  ముందుకేయలేని పిరికితనం ,,
బలం లేక  కాదు ,దైర్యం  చాలక ......
చుట్టూ అల్లుకుంటు న్న చీకటి భయం  కల్గిస్తుం టే
సత్తా కల్గి కూడా  ముందుకు సాగలేని నిస్తేజం .....

             తినేది  సాత్వికాహారమైనా ,అవసరమైతే కొమ్ము  విసిరి
              అన్యాయాన్ని ఎదిరించ గలమని తెలుసు కోలేని తనం ...
              కాని,,,, ఎన్నాళ్ళిలా???
              ఇది కొనసాగుతే, రాబోయే తరాలలో
              సంక్రాంతికి  గంగిరెద్దుల మేళం  ఉండేనా??
              దున్నపోతుల  స్వైరవిహారం పెరగదా???
   
మేక వన్నె పులుల కధ నాటిది ,
అవు వన్నె దున్నపోతుల కధ  నేటిది.

             పోలాలలోని  గింజలు  రాబందుల వశమై,
             సంక్రాంతి సంబరాలు దున్నల  వశమైతే ,
             ఆ  సమాజం  పేరేంటి ???

  తెలివితో బాటు  ధైర్యం కావాలి.
  జయించే పోరాట  పటిమ  రావాలి.
  కేవలం పాలిచ్చి తృప్తి పడడం కాదు ,
 పాలు పంచుకోవడం కూడా రావాలి.
           
                 మంచితనం చేతకానితనం కాదంటు ,
                 దున్నపోతుల ను నిలువరిం చాలి .
                 సత్యమేవజయతే నినాదంలోని
                 స్వరం  తప్పటడుగు  వేయరాదు .
 
 నిలకడగా  నిలిచిన  ఆ సత్య ధర్మాలే
భవిష్యత్తుకు స్వాగత  గీతాలు కావాలి..

నిశబ్దం

లోయల  లోతుల్లోని మార్మిక  ప్రతిధ్వని  పర్వతాల గాంభీర్య మై ,
చెట్ల  శాఖల్లోని రాపిడి  మేఘాల్లోని ఘనీభవించిన నిశబ్ద మై ,
     మైమరపించే సుఖంలోని  స్వప్నమే  నిశబ్దమైన  విషాదమై,
     ఆలోచన లేని  కృత్రిమ  శబ్దాలే  మృత్యువు లాంటివి  నిశబ్దమై ,
సున్నితమైన నిశబ్దానికి  చోటిచ్చే  సవ్వడుల మధ్య  సమయమై ,
ఆ సవ్వడులకు  పునాది యైన  చీకటి రాత్రుల దరహసమై ,
        రెండు మహా యుద్ధాల మధ్య  నిజమనుకుంటున్న శాంతి కపోతమై,
        మారుతున్న మనుషుల, వ్యవస్థ ల  జారిపోతున్న
        విలువలను  నిశబ్దంగా పరికిస్తున్న నిర్వచనీయ నిశబ్ద మిది.
         యుగయుగాల  నుంచి  కొనసాగుతున్న నిశబ్ద మిది .
         ఆ ద్యంత రహితమైన నిశబ్ద మిది......