Sunday 9 October 2011

కౌముది: తొలి అరుణ కిరణం  మాయామాళవగౌళంలోఅవరోహణను  విన్పిస్...

కౌముది: తొలి అరుణ కిరణం మాయామాళవగౌళంలో
అవరోహణను విన్పిస్...
: తొలి అరుణ కిరణం మాయామాళవగౌళంలో అవరోహణను విన్పిస్తూ భువికి దిగుతోంది ... జలపాతం నుంచి కిందికురికే సంతత ధారలో ఒక బిందువు ఎగిరి వెళ్ళి ...

కౌముది: తొలి అరుణ కిరణం  మాయామాళవగౌళంలోఅవరోహణను  విన్పిస్...

కౌముది: తొలి అరుణ కిరణం మాయామాళవగౌళంలో
అవరోహణను విన్పిస్...
: తొలి అరుణ కిరణం మాయామాళవగౌళంలో అవరోహణను విన్పిస్తూ భువికి దిగుతోంది ... జలపాతం నుంచి కిందికురికే సంతత ధారలో ఒక బిందువు ఎగిరి వెళ్ళి ...
తొలి అరుణ కిరణం  మాయామాళవగౌళంలో
అవరోహణను  విన్పిస్తూ భువికి దిగుతోంది ...
జలపాతం నుంచి కిందికురికే  సంతత ధారలో  ఒక బిందువు
ఎగిరి వెళ్ళి కిరణంతో కలిసింది ...............
వెచ్చటి కిరణం ,జీవమిచ్చే  జలకణంతో
సంగమించినది .
ప్రాణానల  సంయోగమే కదా నాదం ..

శా రద కచ్ఛపి  కొత్త గమకాన్ని పలికింది ,
విరించి  కళ్ళేగుర  వేసాడు.
నా రాగం  నీ భావం  అంది వాణి చిరునవ్వు ,
తల పంకించి  కిందికి  చూసాడు విరించి ........
సృష్టి,దృష్టి నిరంతరం పరిణామం చెందక  తప్పదు ..
పచ్చని  ప్రకృతి,, అనంత నీలి సాగరం ,,
ఆహ్లాదకర వాతావరణం----,  -----
నవీనత కోసం ఏర్పాటుఆయిన మబ్బుల  సింహాసనం ,,,,
వచ్చే అతిధి  ఎవరో ?????

కాని ,,,
సర్వ సన్నాహాలు జరిగి పోతున్నాయి .
కచ్ఛపి తంత్రులు పలికే రాగం ,మిశ్రరాగంగా  రూపొందింది .
అందులోనూ సంగతులు జంట స్వరాలై  కులికాయి ,.
రాగాన్ని  వింటున్న విరించి చూపులు
మిథున రూపాన్ని  రచించాయి.
పులకరించిన ప్రకృతి పూల వర్షాన్ని  కురిపించింది..
సహకారం ,మమకారం సహజీవనమైనాయి ....

విశ్వం  తన పరిధిని  విశాలం  చేసుకుంది ........