Thursday 8 September 2011

గురువు

గాడాంధకారంలో  మున్గిపోయింది.


పాపం నది ,,


చెట్లు  కూడా నిశ్చలమై  పోయాయి.


చంద్రుడు  కూడా  మేఘాల  చాటునే ,,,,


భయపడి కాబోలు ----------


వీస్తున్న గాలిలో మాత్రం  పూలవాసన 


చీకటి గర్వంగా నవ్వినట్లు అనిపించింది.


ఎత్తు  దిమ్మ  మీద  కూర్చున్నానని అనిపించింది.


కాని,,


అది దేని కంటే  ఎత్తుగా ఉంది??


చీకటి నుండి బయటికి రావాలని ఎప్పటినుంచో ప్రయత్నం;


చీకటి వెలుగుల మధ్య ఏ వాహిక  నాకు అందటంలేదు .


అయినా;;;


నా ప్రయత్నం మానలేదు .


కొంతసేపటికి  చీకటి  నాకలవాటు  అయింది .


నెమ్మదిగా  స్నేహం  చేసాను.


చల్లగా  నిమిరింది  నన్ను చీకటి ,


ఆ స్నేహ పరిమళం  అర్థం అయింది.


నన్ను  చూసి భయపడితే , పారిపోతే ,,


వెలుగును ఎట్లా  అందుకుంటావు ??


అంది మంద్రంగా ,,మధురంగా ,,


చీకటి కూడా ఒక గీతాచార్యుడే !!

2 comments:

  1. నైస్ బ్లాగ్ అండి . భలే బావుంది.
    నా ఫిలిం కూడా చూసి చెప్పండి. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను
    మానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
    ప్రేమ ఎంత మధురం - ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
    Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
    https://www.youtube.com/watch?v=RywTXftwkow

    ReplyDelete